HYD: తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనిబాలా దేవి శనివారం హైదరాబాద్లోని లోక్ భవన్లో గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను కలిశారు. గవర్నన్ను శాలువాతో సత్కరించి పూల బొకేను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, యువ ప్రతిభను ప్రోత్సహించడం, క్రీడా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం వంటి కీలక అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు.