JGL: జూన్ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అన్ని శాఖల సమన్వయంతో ఘనంగా నిర్వహించాలని జగిత్యాల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు, ప్రోటోకాల్ ప్రకారం సీటింగ్, వసతులు, భద్రతా చర్యలు పక్కాగా చేపట్టాలని సూచించారు.