RR: విద్యను ఖర్చుగా కాకుండా భవిష్యత్ తరాలపై పెట్టుబడిగా భావిస్తున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. అకాడమిక్ సక్సెస్ మీట్-2026లో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గిరిజన గురుకులాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తూ అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయని పేర్కొన్నారు.