TG: రాష్ట్రంలో 2019 ఇంటర్ ఫలితాలను తారుమారు చేసిన ‘గ్లోబరీనా’ సంస్థ, పేరు మార్చుకుని CBSE కాంట్రాక్ట్ దక్కించుకుని పెద్ద గందరగోళం సృష్టించిందని మాజీమంత్రి కేటీఆర్ విమర్శించారు. గతంలో ఈ సంస్థపై BRS ప్రభుత్వం చర్యలు తీసుకుందని గుర్తుచేశారు. దీనిపై కేంద్రం, విద్యాశాఖ సమాధానం చెప్పాలన్నారు. CBSE మార్కులపై పోరాడుతున్న విద్యార్థులను అభినందిస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.