AP: DSC ప్రశ్నపత్రాలను ఎవరూ లీక్ చేయలేరని కోన శశిధర్ స్పష్టం చేశారు. ఒక్కో సబ్జెక్టుకు 3 వేల ప్రశ్నలు తయారు చేసి, నిపుణులు రూపొందించిన పేపర్లను TCS సర్వర్‌లో అప్లోడ్ చేస్తామన్నారు. సిస్టమ్‌లో ఎన్‌క్రిప్ట్‌లో ఉన్న పేపర్లు డీక్రిప్ట్ అయ్యి, విద్యార్థులకు వేర్వేరు ప్రశ్నలు వస్తాయన్నారు. TCS అయాన్ సాఫ్ట్‌వేర్‌లో అక్రమాలకు ఛాన్సే లేదని చెప్పారు.