KMM: తల్లాడ మండలం రామానుజవరం వద్ద కారు అదుపుతప్పి బారికేడును ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో అన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్తున్న బొల్లారం కానిస్టేబుల్ జస్వంత్ అక్కడికక్కడే మృతి చెందగా, భార్య, కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే, నాలుగేళ్ల కుమారుడు సురక్షితంగా బయటపడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.