BHPL: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా వేసవి శిక్షణ శిబిరాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. MLA మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తోందని, విద్యార్థులు అందుబాటులో ఉన్న సదుపాయాలను వినియోగించుకుని ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు. శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.