NLG: త్రిపురారం మండలంలోని పెద్దదేవులపల్లి రిజర్వాయర్లో సోమవారం ఓ మత్స్యకారుడికి భారీ చేప చిక్కింది. గ్రామానికి చెందిన సింగం సతీష్ రిజర్వాయర్లో వల వేయగా సుమారు 20 కేజీల బరువున్న ‘పొందుగ జెల్ల’ లభ్యమైంది. ఇంత పెద్ద చేప దొరకడం అరుదని, దీనివల్ల మంచి లాభం చేకూరిందని సతీష్ ఆనందం వ్యక్తం చేశాడు.