MDK: ప్రజాబాట కార్యక్రమంలో విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరిస్తున్నట్లు తూప్రాన్ విద్యుత్ శాఖ డీఈ గరత్మంత్ రాజ్ పేర్కొన్నారు. తూప్రాన్ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అల్లాపూర్ చౌరస్తా వద్ద నిర్వహించిన ప్రజాబాట కార్యక్రమంలో డిఈ పాల్గొన్నారు. ప్రజలు విద్యుత్ సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈ వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.