AP: బందరు పోర్టు కోసం ఉద్యమిస్తే.. తమని పెయిడ్ ఆర్టిస్టులన్నారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పోర్టును పూర్తి చేస్తామన్నారు. ఫిషింగ్ హార్బర్ల పనుల్లో కమీషన్లు తప్ప YCP చేసిందేమీ లేదని విమర్శించారు. పోర్టులు పూర్తి చేసేది తామేనని.. ప్రారంభోత్సవాలు చేసేది తామేనని అన్నారు. ప్రజా సమస్యలపై YCPకి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రావాలని నిలదీశారు.