AKP: రాబోయే ఖరీఫ్ సీజన్లో ఎరువుల సరఫరా పారదర్శకంగా జరగాలని, ధరల విషయంలో జాగ్రత్తలు పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారిణి ఆశాదేవి ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం అనకాపల్లిలో వ్యవసాయ అధికారులు, ఏడీఎలు, హోల్‌సేల్ డీలర్స్‌తో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రభుత్వం ఎరువుల పంపిణీకి ఏపీ ఎయిమ్స్ యాప్ అమలులోకి తీసుకొచ్చిందన్నారు.