RR: చేవెళ్ల మండలం, కమ్మెట గ్రామంలో గౌడ సంఘం, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి వార్షిక బోనాల పండుగ, భక్తి, సంప్రదాయం, సంస్కృతి, పోతురాజుల విన్యాసాలతో ఘనంగా నిర్వహించడం జరిగింది. అమ్మ వారి ఆశీస్సులు అందరిపై ఉండి అందరు సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. ఈ పండుగలో గ్రామస్తులు, గ్రామ పెద్దలు, నాయకులు పాల్గొన్నారు.