NRML: యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని బాసర సీఐ కిరణ్ కుమార్ సూచించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బాసర రైల్వే స్టేషన్, ప్రధాన కూడళ్లలో నేడు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యువకులు, ఆటో డ్రైవర్లతో కలిసి గస్తీ నిర్వహిస్తూ మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై చైతన్యం కల్పించారు. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు.