NLG: యుద్ధంతో ప్రపంచ మానవాళికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ముప్పు ఉందని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణంలో ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం ప్రపంచ శాంతికి విఘాతం అనే అంశంపై సెమినార్‌ను నిర్వహించారు. టీఎస్ యూటీఎఫ్, సీఐటీయూ, పీపుల్స్ ప్రోగ్రెస్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్లో ఆయన మాట్లాడారు.