TPT: సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఛైర్మన్గా జాన్సన్, వైస్ ఛైర్మన్గా మురళి నియమితులయ్యారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఈ కమిటీకి గౌరవ అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేయగా, పలువురు స్థానికులు సభ్యులుగా బాధ్యతలు చేపట్టనున్నారు.