TG: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల సౌకర్యార్థం ‘పార్క్&ఫ్లై’ పేరిట సరికొత్త పార్కింగ్ విధానాన్ని ప్రారంభించారు. ఇకపై ప్రయాణికులు విమానాశ్రయానికి వెళ్లకముందే ఇంటి నుంచే పార్కింగ్ స్లాట్‌ను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఈ వెసులుబాటు వల్ల ఎయిర్‌పోర్టులో పార్కింగ్ స్థలం కోసం వెతుక్కోవాల్సిన ఇబ్బంది తప్పుతుంది.