రాజకీయ రంగప్రవేశంపై మంచు లక్ష్మి తాజాగా క్లారిటీ ఇచ్చింది. తనకు ప్రధాని మోదీని నేరుగా కలిసే సాన్నిహిత్యం ఉందని, ఎవరైనా రాజ్యసభ సీటు ఇస్తే ఎంపీగా బాధ్యతలు తీసుకుంటానని చెప్పింది. ఎన్నికల్లో పోటీ చేసేంత సమయం ప్రస్తుతం లేదని తెలిపింది. తన సేవా కార్యక్రమాలు చూసి చాలామంది రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారని, అందుకే భవిష్యత్తులో పాలిటిక్స్‌లోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.