GNTR: ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు గుంటూరు జడ్పీ హాల్లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల అధికారులతో సమావేశమై స్వర్ణాంధ్ర విజన్-2047పై చర్చించారు. మౌలిక వసతులు, రహదారులు, తాగునీటి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యతలో రాజీ పడొద్దని, ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించాలన్నారు.