శ్రేయస్ అయ్యర్ తను ఎదుర్కొన్న విమర్శల గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘నా పని అయిపోయిందని, అంతర్జాతీయ స్థాయిలో ఆడేందుకు నా టెక్నిక్ సరిపోదని ఎగతాళి చేశారు. కానీ ఆ విమర్శలే నన్ను మరింత బలంగా పుంజుకునేలా చేశాయి. నేను ఎవరికీ సమాధానం చెప్పదలుచుకోలేదు. మాటలతో కాకుండా, నా బ్యాట్‌తోనే ప్రతి విమర్శకుడి నోరు మూయిస్తా. నా ఆట తీరే నేను ఎవరో నిరూపిస్తుంది’ అని పేర్కొన్నాడు.