NGKL: పట్టణంలోని స్ట్రీట్ ఫుడ్ విక్రేతలు పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అసిస్టెంట్ ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ ఆనందరావు సూచించారు. జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహించారు. పాలు, నూనె వంటి పదార్థాల్లో కల్తీపై ఫిర్యాదులు వస్తున్నాయని, విక్రేతలు శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు.