పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభుసిమ్రాన్ సింగ్ ఈ ఐపీఎల్ సీజన్లో తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 35 బంతుల్లోనే మరో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ సీజన్లో ప్రభుసిమ్రాన్‌కు ఇది నాలుగో అర్ధ శతకం కాగా, ఓవరాల్‌గా ఐపీఎల్ కెరీర్లో 11వది కావడం విశేషం.