SRD: పటాన్చెరులో బక్రీద్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హజ్రత్ సయ్యద్ మురాద్ అలీ షా సాహెబ్ ఖిబ్లా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. దర్గా పరిసరాల్లో ట్రాఫిక్ భారీగా నిలిచిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఏసీపీ శ్రీనివాస్ స్వయంగా పర్యవేక్షించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.