TG: కవిత పార్టీకి రాష్ట్రంలో చోటులేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అన్న, తండ్రిపై కోపంతోనే కవిత పార్టీ పెట్టిందని అభిప్రాయపడ్డారు. కవిత ప్రశ్నలకు KCR సమాధానం చెప్పలేకపోతున్నారని తెలిపారు. కవిత చెప్పే నిజాలను KCR ఒప్పుకున్నారని చెప్పారు. కవిత చెప్పేవి నిజాలు కాబట్టే BRS నేతలు మౌనంగా ఉన్నారని పేర్కొన్నారు. BRS పాపపు పాలనలో తాను భాగమని కవిత ఒప్పుకుందన్నారు.