BHPL: హైదరాబాద్ నానక్రామ్గూడలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ జడ్పీ ఛైర్పర్సన్ గండ్ర జ్యోతి పాల్గొన్నారు. సభ్యత్వ నమోదు, గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం, రాబోయే కార్పొరేషన్ ఎన్నికలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు హాజరయ్యారు.