AP: ఆక్వా, వరి రైతులకు ఇంధన కొరత రాకుండా చూడాలని అధికారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలు జారీ చేశారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసేవారిపై కేసుల నమోదు చేయాలని సూచించారు. ఇంధనం ఇవ్వని బంకులపై 1967 నెంబర్కు ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఈ ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.