TG: కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణ కోసం సీబీఐకి లేఖ రాయాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. ఈ మేరకు తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే మంత్రులు స్వయంగా ఢిల్లీ వెళ్లి సీబీఐ డైరెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేయాలని సూచించారు. ప్రాజెక్టులో జరిగిన ఆర్థిక అవకతవకలు, సాంకేతిక లోపాలపై పూర్తిస్థాయి ఎంక్వైరీ చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది.