AP: పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరతపై మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష నిర్వహించారు. ఇంధనాన్ని పక్కదోవ పట్టించేవారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. పెట్రోల్, డీజిల్‌ను దారి మళ్లించే బంకులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. స్టాక్ ఉన్నా లేదని చెప్పే బంకులపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. బంకుల్లో రేషన్ పద్ధతిని కొనసాగించాలని తెలిపారు.