కేంద్ర ప్రభుత్వానికి విమానయాన సంస్థలు కీలక విజ్ఞప్తి చేశాయి. విమాన ఇంధన ధరలు పెరగడం వల్ల నిర్వహణ భారంతో సతమతమవుతోన్నట్లు విమానయాన సంస్థలు వాపోతున్నాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని.. సాయం కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాయి. కేంద్రం స్పందించకపోతే నిర్వహణ అసాధ్యమవుతోందని తెలిపాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే కంపెనీలు మూసేయాల్సి వస్తుందని చెప్పాయి.