AP: పోలవరం జిల్లాలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోన్న పెద్దపులిని బందించేందుకు అటవీశాఖ అధికారులు సిద్ధమయ్యారు. 200 మంది సిబ్బందితో ‘హనుమాన్’ పేరిట ప్రత్యేక ఆపరేషన్ చేపట్టనున్నారు. బెంగళూరు నుంచి నిపుణుల బృందం రేపు రంపచోడవరం చేరుకోనుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పులి సంచరిస్తున్న ప్రాంతాలకు వెళ్లొద్దని అటవీశాఖ అధికారులు సూచించారు.