SDPT: హుస్నాబాద్ పందిళ్ళ జాతీయ రహదారిలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అక్కన్నపేట మండలం కట్కూర్ గ్రామానికి చెందిన మారపల్లి తిరుపతి(30) తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అంబులెన్స్ ద్వారా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.