BDK: ములకలపల్లి మండల కేంద్రంలోని PHC దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న రెగ్యులర్ డాక్టర్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని బుధవారం డిమాండ్ చేస్తూ DMHOకు వినతి పత్రం అందజేశారు. మండలంలోని ప్రజలకు, గిరిజనులకు నాణ్యమైన వైద్యం అందించాలని AISF జిల్లా కార్యదర్శి వరక అజిత్, AIYF జిల్లా సహాయ కార్యదర్శి అనుముల సాయి అన్నారు.