WNP: గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిరిజన యువత కోసం నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ అధికారి పీ. మధు తెలిపారు. ఇందుకోసం అర్హులైన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ఈ నెల 6న ఐడీఓసీ (IDOC) మీటింగ్ హాలులో నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆసక్తి గల యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.