ఖమ్మం జిల్లాలో ఎండ తీవ్రత బుధవారం కొనసాగింది. మధిరలో అత్యధికంగా 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యల్పంగా వేంసూరు, సత్తుపల్లి, కూసుమంచి మండలాల్లో 40.2 డిగ్రీలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కొణిజర్ల (గుబ్బగుర్తి)లో 43.5, ఖమ్మం రూరల్ (పల్లెగూడెం)లో 43.4, ముదిగొండ (పమ్మి)లో 43.3, బోనకల్ రావినూతల, ఖమ్మం అర్బన్‌లో 43.2, డిగ్రీలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.