NGKL: వానాకాలం సాగుకు సిద్ధమవుతున్న రైతులకు వ్యవసాయ శాఖ శుభవార్త తెలిపింది. పెంట్లవెల్లి మండలంలో 50 శాతం సబ్సిడీపై జీలుగ, జనుము విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు ఏవో హెచ్. వికాస్ తెలిపారు. PACS కేంద్రాల ద్వారా పంపిణీ జరుగుతోంది. 30 కిలోల బస్తా ధర రూ.4,905 కాగా, సబ్సిడీతో రూ.2,452.50కి రైతులకు అందిస్తున్నట్లు చెప్పారు.