సౌర విద్యుత్ రంగంలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. 2025లో భారత్ కొత్తగా 37 గిగావాట్ల సోలార్ విద్యుత్‌ను అందుబాటులోకి తెచ్చింది. తద్వారా, అమెరికాను కూడా వెనక్కి నెట్టింది. దీంతో ప్రపంచంలోనే అత్యధికంగా సౌర విద్యుత్ ఉత్పత్తిని పెంచుకుంటున్న దేశాల్లో చైనా (315 గిగావాట్లు) తర్వాత భారత్ రెండో స్థానంలో నిలిచింది.