ఏప్రిల్ 28 టాలీవుడ్ చరిత్రలో ఒక ‘గోల్డెన్ డే’. 1977లో ఈరోజు ఎన్టీఆర్ ‘అడవి రాముడు’ రిలీజై రూ.3 కోట్ల వసూళ్లతో ప్రభంజనం సృష్టించగా, 1994లో ‘యమలీల’ సంచలన విజయం సాధించింది. 2006లో మహేష్ బాబు ‘పోకిరి’ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయగా, 2017లో ‘బాహుబలి-2’ ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటింది. బాక్సాఫీస్ హిట్లకు ఈ తేదీ ఒక కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది.