TG: డిగ్రీ నూతన కోర్సుల రాక కాస్త ఆలస్యంకానుందా..? దోస్త్ మొదటి విడుత తర్వాతే ఇవి అందుబాటులోకి రానున్నాయా..? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. పరిస్థితి చూస్తుంటే దోస్త్ మొదటి విడత కౌన్సెలింగ్లోపు ఈ కోర్సులు అందుబాటులోకి రావడం కష్టంగానే కనిపిస్తున్నది. కాగా, 220 డిగ్రీ కాలేజీలు పలు కోర్సులను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నాయి.