MLG: ములుగు మున్సిపాలిటీలో నల్లా పన్ను విధించాలని నిర్ణయించారు. ప్రతి ఇంటికి నెలకు రూ.100 వసూలు చేయనున్నారు. మిషన్ భగీరథ తర్వాత గ్రామాల్లో పన్ను లేకపోయినా పట్టణంలో అమలు చేస్తున్నారు. ఇటీవల ఇంటింటి సర్వేను మున్సిపల్ సిబ్బంది పూర్తి చేశారు. నీటి సరఫరా సరిగా లేని ప్రాంతాల్లో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.