SDPT: రాజీవ్ రహదారిపై బెజ్జంకి క్రాసింగ్ శంకర్ నగర్ వద్ద మంగళవారం ఉదయం రెండు లారీలు ఢీకొన్నాయి. KNR వైపు వెళ్తున్న ట్రక్కును వెనుక నుంచి వచ్చిన మరో లారీ బలంగా ఢీకొనడంతో రెండు వాహనాలు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయాయి. ఈ ప్రమాదం వల్ల ఉదయం 7 గంటల నుంచి ట్రాఫిక్ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.