SDPT: 800 ఏళ్ల చరిత్ర కలిగిన సంతాన వేణుగోపాల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం మురళి మంగళవారం శ్రీ చిన్నజీయర్ స్వామిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. మే 8న స్వామివారు విమాన రథోత్సవంపై పురవీధుల్లో ఊరేగనున్నారు. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.