కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో 19 ఏళ్లలోపు బాలికల కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘స్నేహ గ్రూప్’ అవగాహన సదస్సు నిర్వహించారు. బాల్య వివాహాల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, చట్టపరమైన రక్షణలపై వక్తలు అవగాహన కల్పించారు. విద్యతోనే సామాజిక మార్పు సాధ్యమని, మహిళలు స్వయం సమృద్ధి సాధించాలని మహిళలకు, విద్యార్థులకు అధికారులు పిలుపునిచ్చారు.