MHBD: తొర్రూర్ మండలంలో అమ్మపురం గ్రామంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం వైభవంగా జరిగాయి. పార్టీ గ్రామ అధ్యక్షుడు ముద్దం వీరారెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కష్టాలు మొదలయ్యాయి అని విమర్శించారు.