BHNG: ప్రజారోగ్య అవగాహన కోసం బీబీనగర్ ఎయిమ్స్ 89.6 ఎఫ్ఎమ్ కమ్యూనిటీ రేడియోను ప్రారంభించింది. దేశంలోనే ఈ ఘనత సాధించిన తొలి ఎయిమ్స్ ఇదే. ఎయిమ్స్ అధ్యక్షుడు డా.చంద్రశేఖర్ మెష్త్రామ్, డైరెక్టర్ ప్రొ.అమితా అగర్వాల్, ఎంఎస్ డా.మహేశ్వర్ లక్కిరెడ్డి ఈ స్టేషన్ను ప్రారంభించారు. ఇది స్థానిక ప్రజలకు నిరంతరం ఆరోగ్య సమాచారాన్ని అందిస్తుంది.