GDWL: కాకులవరం గ్రామంలో ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాలు, సామాజిక అంశాలపై అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. జిల్లా కోఆర్డినేటర్ నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలకు లేబర్ కార్డ్స్, సమృద్ధి సంయోజన ఇన్సూరెన్స్ ప్రాముఖ్యతను వివరించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.