రిటైర్మెంట్ను పక్కన పెట్టిన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్.. 2028 ఒలింపిక్స్లో పోటీపడతానని ప్రకటించింది. ‘నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నీలో రీఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తున్నాను. రిజిస్ట్రేషన్ చివరి తేదీ ఏప్రిల్ 30. కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంటే.. గడువు ముగిసిందని MSG వస్తోంది. దీనిపై WFIలోని పాలనా యంత్రాంగాన్ని సంప్రదిస్తే స్పందించడం లేదు’ అని పేర్కొంది.