ASR: దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణనలో భాగంగా స్వీయగణన ప్రక్రియను అధికారులు వివరించారు. మొత్తం ఐదు దశల్లో నమోదు పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. మొదట మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాలన్నారు. తరువాత ఇంటి లొకేషన్‌ను సమర్పించాలన్నారు. మూడో దశలో గృహ నిర్మాణ స్థితి వివరాలు, నాలుగో దశలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు నమోదు చేయాలన్నారు.