BDK: బూర్గంపాడు మండలం, సారపాక గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గ్రామసభ నిర్వహించారు. ఉప సర్పంచ్ కన్నిదారి రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గ్రామ అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు పాల్గొని పంచాయతీ రాజ్ వ్యవస్థ ప్రాధాన్యాన్ని వివరించారు.