VSP: బాలింతలు-పిల్లలకు పౌష్టికాహారం అందించడంపై అధికారులు కృషి చేయాలని దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం అంబికా బాగ్లో నిర్వహించిన 8వ పోషణ పక్వాడ కార్యక్రమంలో అయన పాల్గొన్నారు. చిరుధాన్యాల వినియోగంతో విటమిన్లు, ప్రోటీన్లు లభించి రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు.