AP: ఈ నెల 27, 28 తేదీల్లో ఉపరాష్ట్రపతి సీ.పీ.రాధాకృష్ణన్ తిరుమలలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. రేణిగుంట విమానాశ్రయంలో అధికారులతో అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్(ASL) సమావేశం నిర్వహించి, రూట్ మ్యాప్, బందోబస్తుపై చర్చించారు. అనంతరం ఎయిర్పోర్ట్ నుండి తిరుమల వరకు క్షేత్రస్థాయిలో భద్రతను పరిశీలించారు.