AP: వైసీపీ నేతల విమర్శలను మంత్రి నారాయణ తిప్పికొట్టారు. అభివృద్ధి చేస్తుంటే అవినీతి అని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చెట్ల కోసం ఒక దాత రూ.2 కోట్లు ఇచ్చారని, ఒక్క పైసా కూడా కార్పొరేషన్ నుంచి ఖర్చు చేయలేదని స్పష్టం చేశారు. నిజాలు తెలుసుకోకుండా అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారని వెల్లడించారు.